ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు ఎరియా సింగరేణి ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలంటూ కలెక్టర్‌కు వినతి

మణుగూరు ఎరియా సింగరేణి ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలంటూ కలెక్టర్‌కు వినతి

మణుగూరు,మే 19: ఆధాబ్ న్యూస్ : మణుగూరు ఏరియాలోని సింగరేణి ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలంటూ సామాజిక సేవకుడు కర్నే బాబురావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఈ వినతిని చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కర్నే బాబురావు మాట్లాడుతూ, ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేసే అవకాశాలు ఉన్నా, భూ నిర్వాసితులను ఉపేక్షించి ఇతరులకు బ్యాక్‌డోర్‌ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్, సూపర్వైజర్‌ కొన్ని సింగరేణి అధికారుల మౌఖిక ఆదేశాలను వెనుకేసుకొని స్థానిక నిర్వాసితులను విస్మరిస్తున్నారని తెలిపారు.

నిర్వాసితులు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఉపాధి విషయంలో న్యాయం జరగలేదని, తాము అర్హులమని నిరూపణలు ఉన్నా పరిశీలన జరగకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే కలెక్టర్ జితేష్ పాటిల్ గారు మరియు మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ స్పందించి, సంబంధిత కాంట్రాక్టర్‌కు తగు ఆదేశాలు జారీ చేసి భూ నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు కర్నే బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణికి చెందిన భూ నిర్వాసితులు కూడా పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!