విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఆవులు మృతి – జూలూరుపాడు మండలంలో విషాదం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సూరారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న ఒక పాత విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా విరిగి పడడంతో అక్కడ పశువులు మేత తింటున్న సమయంలో ప్రమాదం జరిగింది.
స్థానిక సమాచారం మేరకు, విద్యుత్ స్తంభం ఇరిగి పడటంతో రెండు దుక్కి తేడ్లు, మూడు పాడి ఆవులు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. పశుపోషకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
గ్రామస్థులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. పశువైద్య శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి నివేదిక సిద్ధం చేస్తున్నారు. బాధితులకు నష్ట పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 110









