కరకగూడెం మండలంలో తెల్లవారు 4:30 నుండి భారీ వర్షం – ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విన్నవిన
కరకగూడెం, మే 17: ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండల వ్యాప్తంగా శనివారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో ముసలిధార వర్షం కురిసింది. ఈ అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముందుగా నోటీసు లేకుండానే వర్షం రావడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో పంటలు కాపాడుకోవడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు.
స్థానిక వ్యవసాయ అధికారులు ఈ పరిస్థితిపై స్పందించాల్సిన అవసరం ఉందని, లేకపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









