పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బుగ్గ గ్రామంలో 20 లక్షల విలువైన గ్రామపంచాయితీ కార్యాలయం ప్రారంభం
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బుగ్గ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలతో సమావేశమై రెవిన్యూ, వైద్యం, విద్య, అంగన్‌వాడీ, వ్యవసాయ, ఇరిగేషన్, ఫారెస్ట్, పవర్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల సమక్షంలో పలు సమస్యలను పరిష్కరించారు.
పాయం మాట్లాడుతూ, బుగ్గ గ్రామాన్ని దత్తతగా తీసుకొని ఇప్పటికే రూ.6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాగా, అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, పంచాయతీ కార్యాలయం ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా స్థల దాత కుంజా పగిడయ్యను పాయం వెంకటేశ్వర్లు సన్మానించారు. గ్రామస్థులు పాయాన్ని ఘనంగా స్వాగతించి, అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎం.పి.ఓ వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్, నియోజకవర్గ యువత కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు సతీష్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.









