తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అదిరే ఆఫర్ – కేవలం రూ.2000 ప్రీమియంతో రూ.40 లక్షల వరకు జీవిత బీమా!
కరకగూడెం ఆధాబ్ న్యూస్: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం ఓ ప్రత్యేక జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద కేవలం రూ.2000 ప్రీమియంతో రూ.40 లక్షల వరకూ బీమా ప్రయోజనాలు లభించనున్నాయి.
ఈ బీమా పథకంలో ప్రత్యేక ఆకర్షణలు ఇవే:
ప్రమాదం కారణంగా మరణం జరిగితే మొత్తం రూ.40 లక్షల బీమా.
శాశ్వత వైకల్యం ఏర్పడితే వైద్య ఖర్చులు కవరేజీ.
అంబులెన్స్ ఖర్చులకు 1% బీమా కవరేజీ.
ఆదాయ మార్పుల కారణంగా – ఇంటి, వ్యాపార భద్రతపై 1% బీమా.
పిల్లల విద్యా బీమా – గరిష్టంగా రూ.20,000 వరకు.
అంత్యక్రియలకు ఖర్చులు – 1% బీమా.
ఈ పాలసీకి ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ మద్దతు కల్పిస్తోంది. “సురక్షా ఔర్ భరోసా దోనో” నినాదంతో ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
ఇది గ్రామీణ ప్రజలకు ఒక గొప్ప అవకాశం. కేవలం రూ.2000 పెట్టుబడితో కుటుంబ భద్రతను నిర్ధారించుకోండి!









