పినపాకలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
నియోజకవర్గ అభివృద్ధిపై ఆరా – గిరిజన సంక్షేమం పట్ల కట్టుబాటు
మణుగూరు, ఆధాబ్ న్యూస్
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ నందు R&B మరియు ITDA ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు, వాటి నాణ్యత, ప్రభుత్వ భవనాల నిర్మాణ పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
“గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ITDA అధికారులు నిబద్ధతతో పనిచేయాలి. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి అధికారినీ బాధ్యతతో పని చేయాల్సిన అవసరం ఉంది,” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో నియోజకవర్గ స్థాయి R&B మరియు ITDA ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.









