థర్బల్ లేకుండా ఇసుక రవాణా – మణుగూరు-దమ్మకపేట మార్గంలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
మణుగూరు, మే 15: ఆధాబ్ న్యూస్: మణుగూరు నుంచి దమ్మకపేట మార్గంలో థర్బల్ కవర్ల లేకుండా ఇసుక రవాణా చేస్తున్న లారీల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీల వెనుక ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఇసుక ధూళి కమ్ముకోవడంతో ప్రయాణంలో అసౌకర్యానికి గురవుతున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు, కొన్ని లారీ డ్రైవర్లు ఇసుక రవాణా సమయంలో థర్బల్ కవర్ వాడకుండానే రహదారులపై లారీలను నడుపుతున్నారు. ఈ విషయం పై ప్రశ్నించిన సమయంలో, డ్రైవర్లు “లోకల్” అంటూ సమాధానం ఇచ్చి థర్బల్ అవసరం లేదని పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రజలు శంకించేదిగా మారిన ఈ నిర్లక్ష్య చర్యల వల్ల ప్రమాదాలు జరగే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇసుక ధూళి కళ్లలో పడటం, ఊపిరితిత్తుల సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు సంబంధిత రవాణా మరియు పోలీసులు శాఖలను స్పందించాలని కోరుతున్నారు. ఇలాంటి థర్బల్ లేకుండా ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని, రహదారులపై ప్రయాణించే వాహనదారుల భద్రతను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.









