ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా గవాయి ప్రమాణ స్వీకారం

 

సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా గవాయి ప్రమాణ స్వీకారం

న్యూ ఢిల్లీ, ఆధాబ్ న్యూస్:
భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.

భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా గవాయి బాధ్యతలు చేపట్టారు. న్యాయమూర్తి కే. జి. బాలకృష్ణన్ తరువాత ఈ అత్యున్నత న్యాయపదవిని అధిరోహించిన రెండవ దళిత న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచారు.

గవాయి 2003లో బొంబాయ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుకు ఆయన ప్రవర్తితులయ్యారు. దేశ న్యాయ వ్యవస్థకు నూతన దిశను ఇవ్వగల నాయకుడిగా ఆయన భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!