వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ నుంచి రూ.25 లక్షల సాయం
అమరావతి, ఆధాబ్ న్యూస్:
దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైయస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మురళీ నాయక్ చేసిన ప్రాణత్యాగాన్ని అభినందిస్తూ, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్, వారి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
“వయసులో చిన్నవాడైనా, మురళీ నాయక్ ప్రాణత్యాగంతో ఎంతో గొప్పవాడిగా ఎదిగాడు,” అంటూ సీఎం జగన్ ఘనంగా ప్రశంసించారు. జవాన్ కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మురళీ నాయక్ కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం, పార్టీ ముందుండనున్నదని స్పష్టం చేశారు.
Post Views: 128









