ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆపరేషన్ సిందూర్‌ లో భారీ నష్టం.. పాక్ అంగీకారం 11 మంది సైనికులు మృతి.. 78 మందికి తీవ్రగాయాలు

ఆపరేషన్ సిందూర్‌ లో భారీ నష్టం.. పాక్ అంగీకారం
11 మంది సైనికులు మృతి.. 78 మందికి తీవ్రగాయాలు.
ఆధాబ్ న్యూస్: డిస్క్
ఇటీవల భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం కలిగించినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు తొలిసారి అంగీకరించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 11 మంది సైనికులు మృతి చెందారని, 78 మంది గాయపడ్డారని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (DG ISPR) అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

మృతుల్లో ఐదుగురు పాక్ వాయుసేన సిబ్బంది, ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా మృతిచెందినట్టు సమాచారం.

ఇటీవల జరిగిన దాడుల్లో 40 మంది పౌరులు మరణించగా, 121 మంది గాయపడినట్లు DG ISPR ప్రకటనలో పేర్కొంది. పౌరుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు వెల్లడించారు.

ఈ మేరకు పాక్ ప్రభుత్వం అత్యవసరంగా భద్రతా సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. భారత వైపు నుండి ఈ ఆపరేషన్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!