ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏటీఎం మోసాల కేసులో నలుగురిపై 82, 83 నోటీసులు జారీ – పోలీసులు సమాచారం కోరుతూ ప్రకటన

ఏటీఎం మోసాల కేసులో నలుగురిపై 82, 83 నోటీసులు జారీ – పోలీసులు సమాచారం కోరుతూ ప్రకటన

కొత్తగూడెం ఆధాబ్ న్యూస్: ఏటీఎంల ద్వారా ఖాతాదారుల పిన్ నంబర్లు దొంగిలించి కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నలుగురు నిందితులపై కొత్తగూడెం ఫస్ట్ ఎడిషనల్ జెఎఫ్‌సీఎం న్యాయమూర్తి 82, 83 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు జారీ చేశారు. మోసపూరిత కేసులో ఇప్పటికే వీరు జైలు శిక్ష అనుభవించినా, బెయిల్‌పై విడుదలయ్యాక పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయమై కొత్తగూడెం వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం.కరుణాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారని, వారు ఈలావు ఉన్నారు:

1. హరిదాస్ బిశ్వాస్

2. డీఎన్ మజందార్

3. సోనాలి కార్

4. ఆశిష్ దత్తా

 

ఈ నిందితులు ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని ఖాతాదారుల వివరాలు గోప్యంగా సేకరించి భారీగా డబ్బును మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వీరి జాడ తెలిసినవారు వెంటనే 87126 82017 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!