9.3 కేజీల గంజాయి పట్టివేత: ముగ్గురు అరెస్ట్, రెండు బైక్స్ స్వాధీనం
భద్రాచలం,మే 13 ఆధాబ్ న్యూస్: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. మంగళవారం కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మొత్తం 9.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.4.65 లక్షలుగా అంచనా వేయబడింది.
పోలీసుల సమాచారం ప్రకారం, బజాజ్ పల్సర్ మరియు హోండా యునికార్న్ ద్విచక్ర వాహనాల్లో భద్రాచలం మీదుగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు కూనవరం రోడ్డులో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో ఎస్.ఐ గౌతమ్ నేతృత్వంలో సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, గురవయ్య, సుమంత్, శ్రావణి, పార్థసారథి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.









