అశ్వాపురం: విద్యార్థిని అదృశ్యం – పోలీసులకు ఫిర్యాదు
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామానికి చెందిన పోడుతూరి పూజ శ్రీ (19) అనే విద్యార్థిని అదృశ్యమయ్యారు. భద్రాచలంలోని సిద్ధార్థ వొకేషనల్ కాలేజీలో చదువుతున్న ఆమె, ఈ నెల 5న “కాలేజీకి వెళ్తున్నాను” అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం సంబంధిత ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌ఐ మధు ప్రసాద్ కేసును పర్యవేక్షిస్తున్నారు.
Post Views: 158









