ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మోతే వద్ద ద్విచక్ర వాహనం ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు

మోతే వద్ద ద్విచక్ర వాహనం ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని మోతే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి గేదెలను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

చొప్పలా గ్రామానికి చెందిన గిద్దె కృష్ణ అనే యువకుడు తన వ్యక్తిగత పనుల నిమిత్తం మర్కోడ్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మోతే గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. ఊహించని రీతిలో రోడ్డుపైకి వచ్చిన గేదెలను ఢీకొట్టడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!