సుజాతనగర్ వరి సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్
భద్రాద్రి కొత్తగూడెం, మే 9: ఆధాబ్ న్యూస్:
జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ శుక్రవారం నాడు సుజాతనగర్ మండలంలోని వరి సేకరణ కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు వేగవంతంగా సాగాలి. కొనుగోలులో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలి,” అని అధికారులకు స్పష్టం చేశారు.
అకాల వర్షాల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ధాన్యాన్ని వెంటనే కాపాడేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించిన వేణుగోపాల్, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
అధికారులు, సిబ్బంది ఈ తనిఖీ సందర్భంగా కలెక్టర్కు అవసరమైన సమాచారం అందజేశారు.
Post Views: 40









