ప్రతి క్షణం
ప్రజల పక్షం

  యుద్ధ భూమిలో అమరుడైన కళ్లి తాండ జవాన్ – గ్రామం నిండా విషాద ఛాయలు

యుద్ధ భూమిలో అమరుడైన కళ్లి తాండ జవాన్ – గ్రామం నిండా విషాద ఛాయలు
శ్రీ సత్య సాయి జిల్లా,ఆధాబ్ న్యూస్:
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీకి చెందిన కళ్లి తాండ గ్రామ యువ జవాన్ మురళి నాయక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందాడు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడిని ఎదుర్కొంటూ ప్రాణాలను అర్పించిన మురళి నాయక్ త్యాగం గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా గర్వకారణంగా మారింది.

మురళి నాయక్ మరణవార్త తెలియగానే కళ్లి తాండ గ్రామం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీటి ముడుతలతో ఉండగా, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి అర్పించారు. చిన్న వయసులోనే దేశరక్షణ బాధ్యతలు చేపట్టిన మురళి నాయక్, తాను ఎంచుకున్న మార్గంలో అసాధారణ ధైర్యంతో ముందుకు సాగి, చివరికి దేశ సేవలో అమరుడయ్యాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!