సారపాకలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం – పిడుగుపాటుతో కొబ్బరి చెట్టు దగ్ధం
భద్రాచలం ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పులొచ్చి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షం కురిసింది. ఈ తీవ్రమైన వర్షానికి పిడుగు పడి కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధమైంది.
పిడుగు పడిన సమయంలో ఆ చెట్టుకు సమీపంలోనే కొందరు గ్రామస్తులు ఉండటంతో వారు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అయితే చెట్టు పూర్తిగా కాలిపోయి అప్రయోజకంగా మారింది.
ప్రాంతవాసులు ఇటీవలి కాలంలో విపరీతమైన వాతావరణ మార్పులతో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 48









