బోటిగూడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటకు నిప్పు – రైతుకు భారీ నష్టం
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం బోటి గూడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటకు నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపింది.గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో రెండు ఎకరాల మిర్చి తోట పూర్తిగా దగ్ధమైంది. పంటతో పాటు పక్కనే ఉన్న పైప్‌లైన్‌కు కూడా నష్టం వాటిల్లింది.
దగ్ధమైన తోట గుండారపు మల్లయ్య అనే రైతుకు సంబంధించిందని గుర్తించబడింది. తనకు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, కుటుంబం జీవనాధారం కోల్పోయిందని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
Post Views: 30









