ప్రతి క్షణం
ప్రజల పక్షం

  టీజీఎస్‌పీడీసీఎల్ AE లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబాటు

టీజీఎస్‌పీడీసీఎల్ AE లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబాటు

హైదరాబాద్‌, ఆధాబ్ న్యూస్: తెలంగాణలో మరో అవినీతి ఘటన వెలుగు చూసింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ (AE) A. జ్ఞానేశ్వర్ రూ.50,000 లంచం డిమాండ్ చేసి, రూ.10,000 స్వీకరిస్తుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ప్రగతినగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుడు తన స్థలంలో తొమ్మిది (9) మీటర్ల ఏర్పాటు కోసం మరియు 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ పనుల పూర్తి ఆర్డర్ జారీ చేయాలనే అంశాల్లో అధికారిక సహకారం అందిస్తానని AE చెప్పి లంచాన్ని కోరినట్టు సమాచారం.

ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు, ఏసీబీ అధికారులు AEని నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనపై సంబంధిత చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

అవినీతిని అడ్డుకునే దిశగా ప్రజలు కూడా ముందుకు రావాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరిన సందర్భంలో, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయవచ్చు. అలాగే, WhatsApp (9440446106), Facebook (Telangana ACB) లేదా అధికారిక వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!