తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి
ఖమ్మం, ఆధాబ్ న్యూస్ : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కొత్తూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు పరిశాబోయిన లక్ష్మయ్య (55) తాడిచెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే లక్ష్మయ్య మృతిచెందాడు.
ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 28









