మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనంతారం గ్రామానికి చెందిన కొప్పుల సతీష్ (32) మద్యం మత్తులో పురుగుల మందు తాగి మృతిచెందాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం సేవించి
అనంతరం పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సతీష్ తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 30









