తాటిచెట్టును ఢీ కొట్టిన బైక్ – యువకుడికి తీవ్ర గాయాలు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామం సమీపంలో బైక్ అదుపుతప్పి తాటిచెట్టు ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే… గొల్లగూడెం గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్తున్న బైక్ అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఎలబోయిన కళ్యాణ్‌కు కాలు, తొడ భాగాల్లో ఎముక విరగగా, మరో యువకుడు నవదీప్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Post Views: 43









