ఉండవల్లి ప్రజా దర్బార్: ప్రజల బాధలు విన్న నారా లోకేష్, పరిష్కారానికి హామీ
ఆధాబ్ న్యూస్/ఏపీ
ఉండవల్లి నివాసంలో జరిగిన 61వ రోజు ప్రజా దర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విని, పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా ఎంచెర్లకు చెందిన డి. రేవతి, తన భర్త విద్యుత్ శాఖలో పనిచేస్తుండగా మరణించాడని, జీవనోపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. అలాగే, పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామానికి చెందిన పడాల రాముడు, వైఎస్సార్సీ పార్టీ నాయకులు ఇళ్ల స్థలాల పేరిట తమ 0.34 ఎకరాల భూమిని అన్యాయంగా ఆక్రమించారని విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఈ మౌనిక, తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినవారిని, ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని కోరగా, విజయవాడ పోరంకికి చెందిన ఐ. వరప్రసాద్ తన కుమారుడికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని విన్నవించారు.
ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలపై గమనించి, తగిన చర్యలు తీసుకుంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు.









