ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మైనార్టీ గురుకులాన్ని సందర్శించిన కలెక్టర్ జితేష్ పాటిల్

మైనార్టీ గురుకులాన్ని సందర్శించిన కలెక్టర్ జితేష్ పాటిల్

బూర్గంపహాడ్, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో అడుగుపెట్టిన వెంటనే ప్రిన్సిపాల్ ఆయనను శాలువాతో సత్కరించారు.

ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల విజయంలో భాగమైన అధ్యాపక బృందాన్ని కూడా శ్లాఘిస్తూ వారి కృషిని కొనియాడారు.

ఈ సందర్బంగా పాఠశాల పరిసరాలను కలెక్టర్ జితేష్ పర్యవేక్షించి, శుభ్రత పరంగా కొన్ని సూచనలు చేశారు. మరింత ఆకర్షణీయంగా పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆకట్టుకునే విషయమేమంటే, పాఠశాల వద్ద ఉన్న ఇంకుడుగుంతల పరిశీలనలో భాగంగా కలెక్టర్ స్వయంగా పార, గునపం చేతపట్టి మట్టిని తీయడం అందరినీ ఆకర్షించింది. అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూశారు.

ప్రజలకు సేవలో ప్రతి విషయానికీ తానే ముందుండే కలెక్టర్‌ను చూసి, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!