ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మానవత్వం చాటుకున్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

మానవత్వం చాటుకున్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇప్ప చెట్టు గుంపుకు చెందిన గాందర్ల నర్సయ్య శనివారం ఉదయం తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లో విశ్రాంతిగా ఉన్న సమయంలో ఓ పిచ్చికుక్క ఇంట్లోకి చొరబడి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ సంఘటనను గమనించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వెంటనే స్పందించి, నర్సయ్యను 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించాడు. ఆయనతో పాటు పలువురు స్థానికులు కూడా సహాయం చేశారు. గాయాలపాలైన నర్సయ్య ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ చూపిన స్పందన, మానవత్వం అందరినీ ఆకట్టుకుంటోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!