ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తాటిగూడెంలో పిచ్చికుక్క ఉన్మాదం – గాంధర్ల నరసయ్యపై దాడి, తీవ్ర గాయాలు.

కరకగూడెం ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో శనివారం ఉదయం పిచ్చికుక్క ఉన్మాదానికి సంబంధించిన ఘటన కలకలం రేపింది. తాటిగూడెం గ్రామ నివాసి గాంధర్ల నరసయ్య తన ఇంట్లో పండుకొని విశ్రాంతి తీసుకుంటుండగా, పిచ్చికుక్క ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసింది.
ఈ దాడిలో నరసయ్యకు ముఖం, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను స్థానిక కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో మరో పిచ్చికుక్కల బెడద ఉండకూడదని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పంచాయతీకి విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!