భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి గుడి సమీపంలోని గంధం గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
దారం వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు చిన్నపరెడ్డి wed’s శ్రీ వాణి గార్ల వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, వధూవరులను ఆశీర్వదించి అక్షింతలు వేసి నూతన వస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల నాయకులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ పోతిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “ఇది ఎంతో ఆనందకరమైన సందర్భం. వధూవరులకు సకల సౌభాగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.









