ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు మేజిస్ట్రేట్ శివలింగపురంలోని బాలల సదనాన్ని సందర్శించారు

మణుగూరు మేజిస్ట్రేట్ శివలింగపురంలోని బాలల సదనాన్ని సందర్శించారు
మణుగూరు ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని మేజిస్ట్రేట్ కంభపు సూరిరెడ్డి శుక్రవారం శివలింగపురం గ్రామంలో ఉన్న బాలల సదనాన్ని సందర్శించారు. అక్కడి బాలల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన వారికి పండ్లు, బిస్కెట్లు పంచి మానసిక ఉల్లాసాన్ని కలిగించారు.

ఈ సందర్శనలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు అంకం సర్వేశ్వరరావు, వాగబోయిన రమేష్ బాబు, ఎం. శ్రీనివాస్, పోశం భాస్కర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. బాలల సంక్షేమానికి అందరూ తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!