ఉప్పాకలో రైతు పొలంలో క్షుద్ర పూజల కలకలం – పోలీసుల పరిశీలన
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏడూల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రజల్లో భయాన్ని పెంచే విధంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలందరూ మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ రాజ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post Views: 70









