మేడే సందర్భంగా శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మేడే సందర్భంగా మణుగూరు వంద పడకల ప్రభుత్వ దవాఖానాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేస్తూ, వారి సేవలను స్మరించుకున్నారు.
ఎమ్మెల్యేకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ మరియు వైద్య సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన సెమీ ఆటోమేటిక్ బయో కెమికల్ అనలైజర్ మిషన్, నూతన ఫ్రిజ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హాస్పిటల్‌ను శుభ్రంగా ఉంచుతూ, రోగులకు కుటుంబ సభ్యుల్లా సేవలందిస్తున్న శానిటైజ్ కార్మికుల ధైర్యాన్ని ప్రశంసించారు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని చెప్పారు.
హాస్పిటల్ సేవలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, కొత్తగా గైనకాలజిస్ట్‌ను నియమించామని, ఈ నెలలోనే 50కి పైగా ప్రసవాలు జరిగాయని తెలిపారు. ఓపీ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, కాంగ్రెస్ నాయకులు, వైద్యులు, నర్సులు, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు.









