ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పదవ తరగతి ఫలితాల్లో పినపాక టాపర్‌గా నిలిచిన బి. సత్య అనీసిని ని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

పదవ తరగతి ఫలితాల్లో పినపాక టాపర్‌గా నిలిచిన బి. సత్య అనీసిని ని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
పినపాక,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో తాజాగా విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పినపాక నియోజకవర్గానికి చెందిన మణుగూరులోని మాంటిస్సోరి శ్రీ సత్య భాస్కర హై స్కూల్ విద్యార్థిని బి. సత్య అనీసిని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపింది. ఆమె మొత్తం 600 మార్కులలో 585 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ క్యాంప్ ఆఫీసులో సత్య అనీసిని ని ప్రత్యేకంగా సన్మానించారు. విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, గ్రామీణ ప్రాంత విద్యార్థులూ ప్రగతిపథంలో దూసుకుపోతున్నారని ప్రశంసించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థినికి మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్