దశదినకర్మలకు బియ్యం అందజేత తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం .
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ కరకగూడెం మండలం రఘునాథపాలెం వాసి, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాసరావు తల్లి జాడి లక్ష్మీ అమ్మ ఇటీవల పరమపదించగా, నేడు ఆమె దశదినకర్మ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి ఆదేశాల మేరకు, సంఘ సభ్యుడు చల్లూరి మధు జాడి శ్రీనివాసరావు కుటుంబానికి పరామర్శగా 25 కిలోల బియ్యం బ్యాగ్ అందజేశాడు.
జాడి లక్ష్మీ అమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో జాడి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26









