బోయినపల్లి, ఆధాబ్ న్యూస్:
బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే విద్యార్థిని అదే గ్రామంలోని ప్రభుత్వ హై స్కూల్లో పదవ తరగతి చదువుతుంది. చదువులో చురుకుగా ఉండే నాగచైతన్య, కుటుంబానికి గర్వకారణంగా మారింది.
అయితే ఏప్రిల్ 17న అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది. ఆమె మృతితో గ్రామస్తులు, స్కూల్ సిబ్బంది దిగ్బ్రాంతి చెందారు.
ఇంతలో బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో నాగచైతన్య 600 మార్కులలో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తన కూతురు విజయాన్ని గర్వంగా చూసేందుకు ఈ లోకంలో లేరు అనే బాధను వారు తట్టుకోలేక పోతున్నారు.
తన శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధించినా… ఆ విజయం స్వయంగా చూడలేకపోవడం ఆమె జీవితంలోని అత్యంత విషాదకరమైన మలుపుగా మిగిలిపోయింది.
ఇది తెలియజేసిన స్కూల్ టీచర్లు, “చైతన్య వంతురాలు. ఆమె కోల్పోవడం మాకు తీరని లోటు” అని భావోద్వేగానికి లోనయ్యారు.









