సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా
పాల్గొన్న అంగన్వాడి, గ్రామపంచాయతీ, ఆటో యూనియన్ కార్మికులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
మేడే సందర్భంగా సిఐటియు (CITU) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామపంచాయతీ ఉద్యోగులు, ఆటో డ్రైవర్ల యూనియన్‌కు చెందిన కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మికులు శ్రమకు తగ్గ వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేయాలని నినదించారు. మే డే స్ఫూర్తిని అనుసరించి కార్మికుల హక్కుల సాధన కోసం సంఘీభావంగా నిలబడాలని నాయకులు పిలుపునిచ్చారు.
వేదికపై మాట్లాడిన నేతలు కనీస వేతనాల చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇక ఇటీవల అమలులోకి వచ్చిన కొత్త మోటర్ వాహన చట్టం కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఉందని, దానిని సవరించాలని కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.









