కరకగూడెం, ఆధాబ్ న్యూస్
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
రజతోత్సవ సభకు వరంగల్ జిల్లాలోని గ్రామాల నుండి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ స్థాయిలోనే ఉత్సాహాన్ని పెంచుతూ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు.
Post Views: 77









