పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బాలాజీ బేకరీ & స్వీట్స్ ప్రారంభం
పినపాక, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటైన బాలాజీ బేకరీ & స్వీట్స్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా షాపు యజమాని పవన్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం పాయం వెంకటేశ్వర్లు షాపులో స్వీట్స్ కొనుగోలు చేసి పవన్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోడిశాల రామనాథం, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 33









