ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నిరుపేదలకు అండగా సమతా ఫౌండేషన్ అనారోగ్య బాధితునికి 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం

నిరుపేదలకు అండగా సమతా ఫౌండేషన్
అనారోగ్య బాధితునికి 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం
ఆధాబ్ న్యూస్, పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లా, రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ న్యూ పోరట్పల్లికి చెందిన ఆత్రం ఆంజనేయులు (28) గత రెండు నెలలుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయనకు హాస్పటల్‌లో చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుబాటులో లేక, ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ఆయన భార్య కూడా నిండు గర్భిణి కావడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.

ఈ విషయం సోయం జనార్ధన్ ద్వారా తెలిసిన సమతా ఫౌండేషన్ నిర్వాహకులు మార్షల్, దుర్గం ప్రమీల నాగేశ్, ఎన్టిపిసి కమిటీ సభ్యులు కలిసి శనివారం ఆంజనేయులను పరామర్శించారు. అనారోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న వారు, మానవతా దృక్పథంతో స్పందిస్తూ, దాతల సహకారంతో సేకరించిన 11 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు మరియు సమతా ఫౌండేషన్ సభ్యులు దుర్గం నరసయ్య, ముడిమడుగుల సురేష్, చందనగిరి శివప్రసాద్, జిమ్మిడి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సహాయానికి స్పందించిన ప్రతి దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరింత మానవతావాదులు ముందుకు వచ్చి ఆంజనేయులుకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!