విశాఖలో టీచర్‌పై విద్యార్థినికి దాడి: కోపంతో చెప్పుతో కొట్టి వివాదం
ఆధాబ్ న్యూస్, విశాఖ :
విశాఖలోని ఒక ప్రముఖ కళాశాలలో టీచర్ మరియు విద్యార్థి మధ్య ఘాటు గొడవ చోటు చేసుకుంది. ఈ ఘటనలో, ఒక విద్యార్థిని తన టీచర్ని ఫోన్ తీసుకుందని ఆరోపిస్తూ, 12,000 రూపాయలు విలువైన ఫోన్‌ను ఇచ్చేందుకు డిమాండ్ చేసింది.
ఈ విషయంపై గొడవ తీవ్రతకు చేరుకోవడంతో, విద్యార్థిని టీచర్ని బూతులు తిడుతూ అశ్లీలంగా మాట్లాడింది. టీచర్ ఫోన్ ఇవ్వకుండా ఉండటంతో, ఆ విద్యార్థిని కోపంతో ఉన్నట్టుగా చెప్పు తీసుకొని తన టీచర్ని కొట్టింది.
ఈ వివాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.
Post Views: 42









