ఆళ్లపల్లి నూతన ఎస్సై సోమేశ్వర్, పినపాక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆళ్లపల్లి,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ప్రజాభవన్‌లో పినపాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన ఆళ్లపల్లి ఎస్‌ఐ సోమేశ్వర్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌ఐ సోమేశ్వర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త బాధ్యతలలో ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిష్టతో పని చేయాలని సూచించిన ఎమ్మెల్యే, ప్రజల మద్దతుతో సమర్థవంతమైన సేవలందించాలని ఆకాంక్షించారు.
Post Views: 123









