ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విద్యా సంస్థలపై జిల్లా విద్యాధికారుల సమీక్ష పర్యటన

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం మండలంలోని విద్యా సంస్థల అభివృద్ధి, నిర్వహణపై సమీక్షించేందుకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర చారి మరియు (AMO) నాగరాజు శేఖర్ కరకగూడెం మండలానికి పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా ZPHS కరకగూడెం పాఠశాల‌ను సందర్శించి అక్కడ కొనసాగుతున్న నవోదయ పాఠశాల తాత్కాలిక మరమ్మతుల పనులను సమీక్షించారు. పనుల నాణ్యత, పురోగతిని పర్యవేక్షించి సంబంధిత అధికారులకు మార్గదర్శక సూచనలు చేశారు. అనంతరం ZPHS బట్టుపల్లి పాఠశాలకు చేరుకుని పాఠశాలలోని వివిధ రికార్డులు, విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
ప్రస్తుతం జరుగుతున్న సమ్మేటివ్ పరీక్షల ప్రణాళిక, ప్రశ్నాపత్రాల ప్రామాణికత, మూల్యాంకన విధానం తదితర అంశాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయగా, మరింత ప్రమాణాలతో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో మండల విద్యా అధికారి (MEO) మరియు కరకగూడెం HM శ్రీమతి జి. మంజుల బట్టుపల్లి HM శ్రీ టి. మోహన్ బాబు , పాఠశాల సిబ్బంది, CRPs తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!