కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని
బర్లగూడెం ఊరి చివరన చెరువు గట్టు పైన చెట్టుకి ఉరి వేసుకుని చనిపోయిన వ్యక్తి నీలాద్రి పేటగండి గోత్తి కోయ గ్రామానికి చెందిన కుంజా ఇడుమయ్య s/o నంద వయసు 48 సం ఇడుమయ్య అనే వ్యక్తి సుమారు రెండు సంవత్సరముల నుండి మతిస్థిమితం కోల్పోయి గతంలో రెండు సార్లు ఇంటి నుండి వెళ్లిపోగా తన కుటుంబ సభ్యులు అతని వెతికి పట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే కుంజ ఇడుమయ్య మతిస్థిమితం కోల్పోయి తన ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి బర్లగూడం ఊరి చివరన చెట్టుకి ఉరేసుకొని చనిపోయినాడు. ఈ విషయంపై అతని భార్య కుంజా పొజ్జమ్మ ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.
Post Views: 168









