ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మరో రైతుపై పులి దాడి.

మరో రైతుపై పులి దాడి.. ఆస్పత్రికి తరలింపు

కుమురం భీం ఆధాబ్ న్యూస్ : ప్రజలను పెద్ద పులి వణికిస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుండి దాడి చేస్తుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా కొమరం భీమ్ జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం ఓ యువతిపై పులి దాడితో యువతి మృతి చెందింది. తాజాగా మరో రైతుపై పులి దాడి చేసింది. శనివారం సిర్పూర్‌.టి మండలంలోని దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న సురేశ్‌ అనే రైతుపై పులి దాడి చేసింది. పెద్ద పులి దాడిలో తీవ్రంగా గాయపడిన రైతును వెంటనే గ్రామస్థులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాక అధికారులు వెంటనే రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు ప్రత్నిస్తున్నారు. పులి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఒక రోజు వ్యాధిలోనే మరోసారి పులి దాడిచేయడంతో ప్రజలు పొలం పనులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!