వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. హైదరాబాద్,నవంబర్ 30 ఆధాబ్ న్యూస్: ప్రభుత్వ దావాఖానలో సిబ్బంది ,మందులు అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు వైద్య విధాన పరిషత్తును డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కేర్ గా బలోపేతం చేయడం పై సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సేవలు బలోపేతంపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ ను ఆదేశించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వి కర్ణన్ టీజీఎంఎస్ ఐడిసి ఎండి హేమంత్ వాసుదేవరావు, డిఎంఈ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డిప్యూటీ డి ఎం ఈ విమల థామస్ పాల్గొన్నారు.









