ఆధాబ్ న్యూస్, మూవీ న్యూస్ : రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాదులో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మహేష్ బాబు పీ.దర్శకత్వం నవీన్ యేర్నేనీ రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం హీరోగా రామ్ 22వ చిత్రం కావడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మాలినేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా మరో దర్శకుడు హను రాఘవపూడి క్లాప్స్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు శివ నిర్వాణ పవన్ సాదినేని స్క్రిప్ట్ ని మేకర్స్ అందించారు .యువతకు నచ్చే అంశాలతో పాటు చక్కని కథనంతో సినిమా రూపొందనున్నదని భాగ్యశ్రీ బోరుసే కథనాయక నటిస్తున్నారని. త్వరలో సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Post Views: 109









