ఎర్రక్క పార్థివ దేహానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు
కరకగూడెం, అక్టోబర్ 8 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాయినపేట గ్రామానికి చెందిన కొమరం రాంబాబు సతీమణి, పినపాక మాజీ ఎంపీపీ కొమరం సమ్మక్క తల్లి చర్ప ఎర్రక్క అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల నాయకులు బుధవారం ఎర్రక్క నివాసానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, సర్పంచులు వట్టం సందీప్, కొమరం సత్యనారాయణ, ఉప సర్పంచ్ బుడగం రాము, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, వట్టం వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఊకే రామనాథం, పాయం నర్సింహారావు, పోగు వెంకటేశ్వర్లు, భైరశెట్టి చిరంజీవి, ఎల్లు రామకృష్ణారెడ్డి, పూణెం బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.









