ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  ఆపదలో అండగా సాగర్ బ్లడ్ బ్యాంక్ సంస్థ అధ్యక్షులు, వ్యవస్థాపకులు మెంతిని సాగర్ అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సేవాభావం

ఆపదలో అండగా సాగర్ బ్లడ్ బ్యాంక్

సంస్థ అధ్యక్షులు, వ్యవస్థాపకులు మెంతిని సాగర్

అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సేవాభావం

ఆధాబ్ న్యూస్, హైదరాబాద్:
అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉచితంగా రక్తదాన సేవలు అందిస్తూ సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ మానవతా సేవలు కొనసాగిస్తోంది. సంస్థ అధ్యక్షులు, వ్యవస్థాపకులు మెంతిని సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అవసరమైన వారికి రక్తదాన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

సికింద్రాబాద్‌లోని యశోద ప్రైవేట్ ఆసుపత్రిలో దిలీప్ అనే వ్యక్తి ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా, ఆపరేషన్ కోసం అత్యవసరంగా రక్తం అవసరమైంది. ఈ విషయం సాగర్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు మెంతిని సాగర్‌కు తెలియడంతో, హైదరాబాద్‌కు వచ్చిన తన వ్యక్తిగత పనిని సైతం పక్కనపెట్టి సుమారు 40–45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. స్వయంగా రక్తదానం చేయడంతో పాటు మరో ఇద్దరు రక్తదాతలను వెంట తీసుకెళ్లి రక్తదానం చేయించారు.

అదేవిధంగా మణుగూరులోని మాలకొండయ్య ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శాంతమ్మ అనే పేషెంట్‌కు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో రక్తదాతలు ముందుకు వచ్చారు. ఆర్‌టీసీ డ్రైవర్లు సయ్యద్ కరీం, పవన్‌తో పాటు ధరావత్ అనిల్ రక్తదానం చేసి పేషెంట్‌కు అండగా నిలిచారు.

అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన సాగర్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, రక్తదాతలకు పేషెంట్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో రక్తం అందించి ప్రాణాలను కాపాడుతున్న ఇలాంటి సేవా సంస్థలను సమాజం గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.

సాగర్ బ్లడ్ బ్యాంక్ సేవలు మరువలేనివని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సంస్థ అందిస్తున్న సహాయం ఎంతో విలువైనదని పేషెంట్ కుటుంబ సభ్యులు అభినందించారు. రక్తదాతల సేవలను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు, వ్యవస్థాపకులు మెంతిని సాగర్ మాట్లాడుతూ.. సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అనేక మందికి అత్యవసర సమయంలో ఉచితంగా రక్తదాన సేవలు అందిస్తున్నామని తెలిపారు. రక్తం అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒక్కరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు