ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  మలేరియా, డెంగ్యూ నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలి అధికారులకు DMHO డా. తుకారామ్ రాథోడ్ ఆదేశాలు

మలేరియా, డెంగ్యూ నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలి

అధికారులకు DMHO డా. తుకారామ్ రాథోడ్ ఆదేశాలు

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, అక్టోబర్ 5 (ఆధాబ్ న్యూస్): జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు, నిర్ధారణ పరీక్షలు, నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్ అధికారులను ఆదేశించారు.

పాల్వంచలోని జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్‌యూనిట్ అధికారులు, మలేరియా టెక్నీషియన్లు, సపోర్ట్ సూపర్‌వైజర్లు, సంబంధిత ఆరోగ్య శాఖ సిబ్బందితో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ పరీక్షలు, కేసుల గుర్తింపు, సబ్‌సెంటర్‌ల వారీ పనితీరు, టెస్టింగ్ కిట్ల నిల్వ తదితర అంశాలను సమీక్షించారు.

జిల్లాలో నమోదైన Pv, Pf మలేరియా పాజిటివ్ కేసులతో పాటు డెంగ్యూ కేసుల పరిస్థితి, పరీక్షలు, నిఘా చర్యలను పరిశీలించారు. అనుమానిత జ్వర కేసులను నిర్లక్ష్యం చేయకుండా ఫీల్డ్ స్థాయిలో RDT పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

ఆరోగ్య కేంద్రాల్లో టెస్టింగ్ కిట్ల కొరత లేకుండా నిరంతరం స్టాక్‌ను పర్యవేక్షించాలని, అధికంగా కిట్లు ఉన్న కేంద్రాల నుంచి కొరత ఉన్న కేంద్రాలకు పునఃపంపిణీ చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలకు T-HUB వాహనాల ద్వారా కిట్లను త్వరితగతిన తరలించి పరీక్షా సేవలకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.

మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్ సర్వేలు, RDT పరీక్షలు, కేసుల గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్ చర్యలను పటిష్టంగా నిర్వహించాలని డా. తుకారామ్ రాథోడ్ తెలిపారు. ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని స్థాయిల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మలేరియా, డెంగ్యూ నియంత్రణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర నిఘా, పరీక్షలు, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సమావేశంలో డిప్యూటీ DMHO డా. ఎం. శ్రీధర్, అసిస్టెంట్ మలేరియా అధికారి రవి, ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్‌యూనిట్ అధికారులు, మలేరియా టెక్నీషియన్లు, సపోర్ట్ సూపర్‌వైజర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు