ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  PESA, 1/70 చట్టాలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి: తుడుందెబ్బ

PESA, 1/70 చట్టాలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు

తక్షణమే చర్యలు తీసుకోవాలి: తుడుందెబ్బ

కరకగూడెం, అక్టోబర్ 5 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలో PESA, 1/70 చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ మండల అధ్యక్షులు కలం సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.

భట్టుపల్లి గ్రామంలోని కొమరం భీం విగ్రహం సమీపంలో ఆదివాసీల సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం సర్వే నంబర్ 09లో కేటాయించిన సుమారు ఎకరం భూమిలో శివరాత్రి మధు అనే వ్యక్తి వాణిజ్య భవనాలు నిర్మించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సంపత్ కుమార్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములు, సామూహిక వనరులు, సంప్రదాయ హక్కుల పరిరక్షణకు PESA చట్టం, 1996, 1/70 నిబంధనలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.

సర్వే నంబర్ 09కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, స్థల పరిశీలనతో పాటు సమగ్ర సర్వే నిర్వహించి భూమి హద్దులను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా లేదా విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు తేలితే వాటిని నిలిపివేయడంతో పాటు అక్రమ ఆక్రమణలు నిర్ధారణ అయితే తొలగించాలని కోరారు.

అదేవిధంగా 1/70 నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపు లేదా వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ స్థలంలో కొత్త నిర్మాణాలు, విస్తరణలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

ఈ అంశంపై PESA గ్రామసభ అభిప్రాయాన్ని, తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు చేపట్టిన విచారణ, చర్యల వివరాలను ప్రజలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగించేలా అక్రమ నిర్మాణాలు కొనసాగితే తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు