ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిరంతరం పర్యవేక్షించాలి

ఆధాబ్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 03: గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి జూమ్ ద్వారా గోదావరి నది తీర జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిని శైలజ రామయ్యర్ అడిగి తెలుసుకున్నారు.

భద్రాచలంలో చేపడుతున్న పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అంకిత్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య శిబిరాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, విద్యుత్, రహదారులు, బందోబస్తు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలంలో జరుగుతున్న పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత తదితర ఏర్పాట్లపై చేపడుతున్న చర్యలను వివరించారు.

పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సునీత, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు