బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకులు మేడ మోహన్‌రావు
చండ్రుగొండ, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా నాయకులు మేడ మోహన్‌రావు ఖమ్మంలోని ఆసుపత్రిలో పరామర్శించారు.
బెండలపాడు గ్రామానికి చెందిన చీదర్ నవీన్ వాలీబాల్ ఆడుతుండగా కాలికి గాయం కావడంతో నరం తెగి గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా బెండలపాడు గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు పొడెం శేఖర్‌రావు బెండలపాడు నుంచి చండ్రుగొండకు బైక్‌పై వెళ్తుండగా గేదె అడ్డురావడంతో బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన కుడిచేయి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా మేడ మోహన్‌రావు ఇద్దరినీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, చండ్రుగొండ మండల యువజన నాయకుడు భానోత్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.









